సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా చంద్రముఖి. హర్రర్ కథాంశంతో వచ్చి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సినిమాలలో చంద్రముఖి ఒకటి. 'బాబా' సినిమా ఫ్లాప్ తర్వాత రజినీకాంత్ ఇక సినిమాల్లో నటించాలా వద్దా అనే దైలమాలో ఉన్నప్పుడు దర్శకుడు పి.వాసు కన్నడలో తెరకెక్కించిన 'ఆప్తమిత్ర సినిమా చూపించారు. సినిమా చూపించిన అనంతరం తెలుగు తమిళ, భాషలలో మీరు హీరోగా నటిస్తానంటే నేను తెరకెక్కిస్తానని వాసు రజినీని కోరారు. ఇక కథ ఎంతో నచ్చిన రజనీకాంత్ కూడా దానికి ఓకే అన్నారు. కానీ చంద్రముఖి సినిమాకు 1993 మలయాళం లో విడుదలైన 'మనీచిత్ర తాజ్ సినిమా ద్వారా బీజం పడింది. ఈ సినిమానే పి.వాసు కన్నడ లో మొదట 'ఆప్తమిత్ర' పేరుతో తీయగా... ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో రజనీకాంత్ హీరో గా నిర్మించారు.
ఇక రజినీకాంత్ అప్పటివరకు ఏ సౌత్ హీరో తీసుకోని రెమ్యూనరేషన్ ఈ సినిమాకు తీసుకున్నాడు. ఈ సినిమాలో లో రజనీకాంత్ కు జోడీగా నయనతార నటించింది. వడివేలు, నాజర్ ప్రముఖ పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో అన్ని పాత్రల కంటే జ్యోతిక పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. జ్యోతిక తన పాత్రకు న్యాయం చేయడమే కాదు చంద్రముఖిగా జీవించేసింది. దాంతో ఈ సినిమా తెలుగులో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. సీక్వెల్ కు కూడా .పి వాసు గారి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రకటించగా.... జ్యోతిక కూడా నటిస్తుందా..? అనే ప్రశ్నలు వెళ్లువెత్తున్నాయి. కాగా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో జ్యోతిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. చంద్రముఖి సీక్వెల్ కోసం ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. అయితే చంద్రముఖి సినిమాకు తన నటనతో ప్రాణం పోసిన జ్యోతిక సీక్వెల్ కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి జ్యోతిక చంద్రముఖి సీక్వెల్ లో నటిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.