జగపతి బాబు కెరీర్ ని మలుపు తిప్పిన సంవత్సరం ఇదే..!!

N.ANJI
ప్రముఖ నటుడు జగపతి బాబు అందరికి సుపరిచితమైన వక్తినే. ఆయన నటనతో మన ఇంట్లో ఒక్కరిగా కలిసిపోయారు.ఒక్కప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా రాణిస్తున్నారు. ఇక జగపతిబాబు సినిమా కెరీర్ ని 1997 ఓ మలుపు తిప్పింది. ఆ సంవత్సరంలో ఆయన చేసిన సినిమాలు టాప్ రేంజ్ కి తీసుకెళ్లాయి. ఇక ఆ ఏడాది ఆయన 6 సినిమాలు చేస్తే, ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు.
ఇక  రెండు కుటుంబాలను కలుపుతూ తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లాడనే ఇతివృత్తంతో వచ్చిన శుభాకాంక్షలు మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎస్ ఏ రాజ్ కుమార్ మంచి బాణీలు అందించారు. ఈ సినిమాలో రాశి హీరోయిన్. రవళి కూడా నటించారు. ఆ తరువాత సౌందర్యతో కలిసి చేసిన ప్రియా రాగాలు మూవీ కూడా జగపతిబాబుకి మంచి విజయాన్ని అందించారు. ఇక ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. అయితే ఎమోషనల్ ఎంటర్టైన్ మెంట్ తో సాగె మూవీలో మహేశ్వరీ కూడా నటించారు.
అలాగే ఒకరికొకరు అనుకోకుండా పెళ్లి చేసుకున్న జగపతి బాబు, ఇంద్రజ లు రైలు ప్రమాదంలో అందరినీ పోగొట్టుకుని ఎలా ఒక్కటయ్యారన్న ఇతివృత్తంతో వచ్చిన ఒక చిన్నమాట మూవీ మరో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కామెడీ,ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ చేశాడు. అయితే ఇదే ఏడాది వచ్చిన దొంగాట సినిమా కూడా మరో హిట్ అందుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, సౌందర్య, సురేష్ నటించారు. ఈ మూవీని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు.ఆలాగే మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
అంతేకాక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిలకొట్టుడు మూవీ ఏవరేజ్ గా రాణించింది.ఇక కన్నడ ఫిలిం అనురాగ సంగమ కు రీమేక్ గా వచ్చిన పెళ్లిపందిరి మూవీతో జగపతి బాబు హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఫ్రెండ్షిప్ కోసం ప్రేమను త్యాగం చేసే స్నేహితుడుగా జగపతి బాబు నటన అద్భుతంగా రాణించారు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన రాశి హీరోయిన్ గా రాణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: