మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా.? రానా బంపర్ ఆఫర్?

praveen
సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు..  అలా అని అందరూ నటులే కావాలని కోరుకోరు కదా.. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది.. కొంతమంది చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తమలోని నటుణ్ణి నిరూపించుకొని సత్తా చాటాలని భావిస్తూ ఉంటారు  ఈ క్రమంలోనే సరైన అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్రపరిశ్రమలో రాణిస్తూ ఉంటారు. అలాగే అటు సింగర్స్ కావాలనుకునేవారు.. డైరెక్టర్ లుగా రాణించాలి అనుకునేవారు  కూడా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.



 ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎంతో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇటీవల కాలం లో తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతోమంది కొత్త హీరోలు సైతం బాగా రాణిస్తున్నారు. ఇక ఇటీవల సింగర్స్ గా రాణించాలనుకునే వారికి తమ మ్యూజిక్తో సత్తా చాటాలి అనుకునే వారికి దగ్గుబాటి వారసుడు రానా ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించాడు.  సాధారణంగా ఎంతో మందిలో సింగింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేక నిరాశ చెందుతుంటారు.



 ఇలాంటి వాళ్లకు ఇటీవలె రానా ఇచ్చిన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి  ఇక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తమకు నచ్చింది.. అందరిని ఇంప్రెస్స్ చేసే విధంగా ఒక మ్యూజిక్ కంపోజ్ ఇక దానిని రానాకు పంపితే రానా కూడా మీ మ్యూజిక్ ని ఇంప్రెస్ అయ్యారు అంటే ఆ మ్యూజిక్ తన సినిమాలోకి తీసుకుంటాను అని చెబుతున్నాడు దగ్గుబాటి వారసుడు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నాడు. తమ టాలెంట్ను నిరూపించుకోవాలని ఆతృతతో ఉన్నవారికి రానా ఇచ్చిన ఆఫర్ బంపర్ ఆఫర్ లాంటిది అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: