వైష్ణవ్ తేజ్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

N.ANJI
ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయమైనప్పటికీ కొందరికిమాత్రమే మొదటి సినిమాతో గుర్తింపు వస్తుంది. ఆలా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో వైష్ణవ్ తేజ్ ఒక్కరు. ఆయన ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా తెరంగ్రేటం చేశారు. ఇక తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

అంతేకాదు.. వసూళ్ల పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడం, సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఉప్పెనతో అంతకు ముందు హీరోలు తొలి సినిమాలతో క్రియేట్ చేసిన రికార్డులను సులభంగా వైష్ణవ్ తేజ్ సులభంగా అధిగమించారు. ఇక వైష్ణవ్ తేజ్ ఫేవరెట్ హీరో మాత్రం మెగాహీరో కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
 .
తాజాగా ఓ షో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ ని మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నిచంగా ఆయన మెగా అభిమానులకు షాకిచ్చే ఆన్సర్ ఇచ్చాడు. అయితే వైష్ణవ్ తేజ్ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ అని చప్పుకొచ్చారు ఆయన. అయితే సాధారణంగా యంగ్ జనరేషన్ మెగా హీరోలలో ఎక్కువమంది చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తమ ఫేవరెట్ హీరో అని చెబుతుంటారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం రజినీకాంత్ పేరు చెప్పి మెగా ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేసిన వైష్ణవ్ తేజ్ తనకు సంబంధించిన ఎన్నో సీక్రెట్లను అభిమానుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పుకొచ్చారు.

అయితే ఓ అభిమాని రజినీకాంత్ నటించిన సినిమాలలో ఇష్టమైన సినిమా ఏమిటని వైష్ణవ్ ని ప్రశ్నించారు.  శివాజీ సినిమా తనకు ఇష్టమని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇక ఉప్పెన సినిమా సక్సెస్ వల్ల పలువురు టాలీవుడ్ దర్శకులు వైష్ణవ్ తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపెడుతున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాలో నటించగా ఆ సినిమా విడుదల కావాల్సి ఉన్నట్లు సమాచారం. ఇక వైష్ణవ్ తేజ్ భవిష్యత్తు సినిమాలు కూడా హిట్టైతే వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో కావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: