విభిన్న కథతో ట్రెండ్ సెట్ చేసిన ఆర్ఎక్స్ 100..?

Suma Kallamadi
2018 సంవత్సరంలో విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో హీరోయిన్లుగా కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ నటించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో వీరిద్దరి క్రేజీ ఎక్కడికో వెళ్ళి పోయింది అంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణం ఆర్ఎక్స్ 100 సినిమా చాలా సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందించారు. ఈ సినిమా కథాంశం గురించి తెలుసుకుంటే.. శివ(కార్తికేయ) అనే ఒక వ్యక్తి ఇందు( పాయల్ రాజ్ పుత్) అనే అమ్మాయి తో ప్రేమలో పడతాడు. నిజానికి ఇందు.. శివ శారీరక దృఢత్వాన్ని చూసి మనసు పారేసుకుంటుంది. అతడితో తన కామ వాంఛ తీర్చుకోవాలని భావిస్తుంది.

అయితే ప్రేమ పేరుతో అతడిని వలలో వేసుకుంటుంది. కానీ శివ మాత్రం ఇందు తనని నిజంగానే ప్రేమిస్తోందని భావిస్తాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ఇందు మాత్రం శివ ని శారీరకంగా వాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా శివ కి మందు, సిగరెట్ వంటి చెడు అలవాట్లు నేర్పిస్తుంది. ఈ మత్తు అలవాట్లతో శివ ని తన వశం చేసుకుంటుంది. అయితే వీరిద్దరి కామకలాపాలు తెలుసుకున్న ఇందు తండ్రి విశ్వనాధం ఆమెకి పెళ్లి చేసి వేరే ప్రాంతానికి పంపించేస్తాడు. సరిగ్గా మూడు సంవత్సరాల అనంతరం మళ్లీ ఆమె తిరిగి వస్తుంది.


అప్పటివరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన శివ.. ఇందు తన కోసమే వచ్చిందంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. కానీ చివరికి ఇందు తనని బాగా వాడుకొని మోసం చేసిందని తెలిసి ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. తనని మోసం చేసినట్లు తెలియగానే అతను చివరికి చనిపోతాడు. అయితే ఒక యువతి తన కామ వాంఛలు తీర్చుకోవడానికి ఒక యువకుడి ప్రాణాలను తీసేసిందని బోల్డ్ గా చూపించడం అజయ్‌ భూపతికి మాత్రమే చెల్లింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి కథతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆర్ఎక్స్ 100 సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: