మామిడి పులుపును ఆస్వాదిస్తూన్న సామ్..!
ప్రస్తుతం సామ్ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటిస్తుంది.ఈ సీరీస్ లో సామ్ నటన అమోఘం అనే చెప్పాలి. ఈ ఒక్క సీరీస్ లోనే సమంతకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఈ సినిమాలో సమంత చేసిన పాత్రకు గాను తమిళ టైగర్స్ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాలో తీవ్రవాది రాజీ పాత్రలో సమంత నటించింది. . ఈ సీరీస్ చూసి తమిళులు బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ 2, బ్యాన్ అమెజాన్ ప్రైమ్ అంటూ ట్యాగ్స్ కూడా ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని తమిళులు బాగా వైరల్ చేయగా అసలు ఈ సిరీస్ లో అంత మ్యాటర్ ఏం ఉందో చూడాలన్న తపనతో జనంలో ఈ సీరీస్ పై ఆసక్తి ఇంకాస్త పెరిగిపోతుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్నదానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతోంది. రాజ్ అండ్ డీకే ఈ సీరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సీరీస్ లో సమంత నటన సూపర్ అని చెప్పాలి.
ఇక సీరీస్ విజయం సమంత ముఖంలో స్పష్ఠంగా కనిపిస్తోంది. తాజాగా సమంత ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో సమంత ఒక మామిడి చెట్టు దగ్గర కూర్చుని ఉంది. ఆ ఫార్మ్ హౌస్ చూస్తుంటే ఎంతో కళాత్మకంగా, ప్లెజెంట్ గా కనిపిస్తోంది.ఆ చెట్టుకి ఉన్న మామిడి కాయను చూస్తే ఎంతో చూడ ముచ్చటగా ఉంది. ఆ పచ్చని మామిడి కాయను, మామిడి ఆకుల్ని కవర్ చేస్తూ దిగిన సామ్ ఫోటో ఎంతో ముచ్చటగొలుపుతోంది. ఆ పిక్ చూస్తే ఉగాది పచ్చడిలోని పులుపుదనం గుర్తు వస్తుంది కదా. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ లాక్ డౌన్ సమయంలో సమంత కూడా ఫామ్ హౌస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.