తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక్క సారి ఈ షోకు వెళ్లి వస్తే సెలబ్రెటీల పాపులారిటీ కూడా అలాగే పెరుగుతుంది. అంతే కాకుండా బిగ్ బాస్ అన్ని సీజన్ లు ఒక ఎత్తు అయితే బిగ్ బాస్ సీజన్ 4 ఒక ఎత్తని చెప్పవచ్చు దానికి కారణం గత సీజన్లకు ఎప్పుడూ రాని రేంజ్ లో బిగ్ బాస్ 4 టీఆర్పీరేంటింగ్ వచ్చింది. దానికి కారణం ఈ షోలో సందడి చేసిన సెలబ్రెటీలే అని చెప్పవచ్చు. ఇక ఇదే షోకు వచ్చిన న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అనవసరంగా నవ్వడం కారణంగా కొంత నెగిటివిటిని మూటగట్టుకున్నప్పటికీ సుజాత ఎలిమినేట్ అయ్యాక మాత్రం చాలామంది అభిమానులు బాధపడ్డారు. ఇక బిగ్ బాస్ కు ముందు సెలబ్రెటీల సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఎలా ఉన్నా బిగ్ బాస్ నుండి వచ్చాక మాత్రం ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతారు. ఈ నేపథ్యంలోనే సుజాత ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు.
ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేయడం....లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెట్టడం చేస్తుంది. ఈ క్రమంలోనే సుజాత తాజాగా ఆస్క్ మీ అంటూ ప్రశ్నలు వేయమని నెటిజన్లను కోరింది. కాగా ఓ నెటిజన్ బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లింగజ్ గురించి చెప్పాలని కోరాడు. దానికి సుజాత సమాధానం ఇస్తూ...రాహుల్ సిప్లింగజ్ నవ్వు చాలా భాగుంటుందని సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా ఆయన నవ్వు ఎంత భాగుంటుందో ఆయన మనసు కూడా అంత మంచిదని అన్నారు. ఇక మరో మూడు ప్రశ్నలు కూడా సుజాతకు ఎదురయ్యాయి. నీకు లవర్ ఉన్నాడా.?
పెళ్లి ఎప్పుడు..? అంటూ ప్రశ్నలు వేశారు. వాటికి సుజాత తన స్టైల్ సమాధానం ఇచ్చింది. అంతే కాకుండా లాస్య గురించి అడగ్గా ఆమె బంగారు కోడిపెట్టె అంటూ సమాధానం ఇచ్చింది. ఇక నోయల్ గురించి అడగగా అతడు శంకరా దాదా అంటూ సమాధానం ఇచ్చింది.