తూచ తప్పకుండా తల్లిబాట లో తరుణ్ !
కెరియర్ కు సంబంధించి సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు అన్న విమర్శలు కూడ వచ్చాయి. ఆతరువాత ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారంలో తరుణ్ లింక్ చేస్తూ అనేక వార్తలు రావడంతో పాటు ఫ్లాప్ లు కూడ ఎదురవ్వడంతో తరుణ్ పేరును జనం మరిచిపోయారు. ఆమధ్య మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇద్దామని ప్రయత్నించి ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేసినా జనం పట్టించుకోలేదు.
తరుణ్ హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోగా కొత్తగా అతడితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రస్తుతం భాగ్యనగరంలోని ఒక కీలక ప్రాంతంలో పబ్ నిర్వహిస్తూ వ్యాపారంలో రాణిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో తరుణ్ ఎవరు ఊహించని డబ్బింగ్ రూట్ పట్టాడు. తన తల్లి రోజారమణి విధానాన్ని అనుసరిస్తూ ఈమధ్య ‘ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ చేసిన లీడ్ రోల్‌కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు.