పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!
పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమా తమిళ్ లో కార్తీక్ నటించిన గోకులతిల్ సీతై సినిమా కి రీమేక్ కాగా ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రమైన సుస్వాగతం సినిమా ఆమె కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలువగా ఈ సినిమా కూడా తమిళ రీమేక్ కావడం విశేషం. అక్కడ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘లవ్ టుడే’ పేరుతో ఈ చిత్రం రూపొందింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచి తమ్ముడు సినిమా కూడా రీమేక్ సినిమానే.. హిందీ చిత్రమైన ‘జో జీత ఓహి సికిందర్’ స్ఫూర్తి తో ఈ సినిమాని తెరకెక్కించారు.
విజయ్ దళపతి హీరోగా నటించిన ఖుషి సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆసిన్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన తిరుపచి చిత్రానికి రీమేక్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన లవ్ ఆజ్ కల్ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ త్రిష జంటగా జయంత్ సి పరాన్జీ తీన్మార్ పేరుతో తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ సినిమాకి రీమేక్. అలాగే ఆయన నటించిన గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ చిత్రాలు రీమేక్ సినిమాలే.