విరాట్ కోహ్లీ మొదట ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా ?
భారతదేశంలో క్రేజ్ ఉన్న వాటిలో మొదటి ఆట క్రికెట్. ఇక రెండవది సినిమా. ఈ రెండిటికీ ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేక హోదా చెప్పనక్కర్లేదు. ఇక క్రికెట్ కు ఉన్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోలతో సమానంగా టీమిండియా క్రికెటర్లకు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే క్రేజ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే.. ఆలోచన ఎలా ఉంది. అయితే ఇప్పటి వరకు క్రికెటర్లు, సినీ హీరోయిన్ల పెళ్లిళ్లు చాలానే జరిగాయి. ఎందరో క్రికెటర్లు కొంతమంది హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు టాక్. అయితే అందులో ప్రముఖ"ఇజాబెల్లె లైట్ " తో ఏకంగా అప్పట్లో రెండేళ్లు ప్రేమలో ఉన్నాడట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కోహ్లీ అనుష్క శర్మ ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వీరికి పాప పుట్టడం అందరికీ తెలిసిన విషయమే.
ఇజాబెల్లె లైట్ బ్రెజిల్ కు చెందిన మోడల్. ఈమె కొన్ని ఇండియన్స్ మూవీస్ లో కూడా నటించింది. అమీర్ ఖాన్ "తాలష్"మూవీ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఇజాబెల్లె . తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఈమె నటించింది.
విరాట్ కోహ్లీ, ఇజాబెల్లె బ్రేకప్ తరువాత ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి తానే స్వయంగా చెప్పింది. ఆ ఇంటర్వ్యూలో ఇజాబెల్లె మాట్లాడుతూ.."అవును మేము రెండేళ్లపాటు ప్రేమలో ఉన్నాం. ఆ తరువాత ఇద్దరి అంగీకారంతోనే విడిపోయాం" అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఎందుకు విడిపోయారనే కారణం అయితే చెప్పలేదు. ఆ కారణం ఏంటనేది వారిద్దరికే తెలిసుండాలి. అయితే ప్రేమించుకున్న వాళ్ళు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని లేదు . కానీ పెళ్లి చేసుకున్న వాళ్లు తప్పకుండా ప్రేమించుకోవాలి అనేది నానుడి. ఇక విరాట్ కోహ్లీ, ఇషాబెల్లా లు విడిపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ ను పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుందాం..