ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

MADDIBOINA AJAY KUMAR
ఫారెన్ పెళ్లి కొడుకులు అంటే సాధారణ అమ్మాయిలకే కాదు హీరోయిన్లకు సైతం ఇష్టం ఎక్కువే. సినిమాలు చేసి కెరీర్ కు గుడ్ బై చెప్పిన తరవాత ఫారెన్ లో సెటిల్ అవ్వాలని చాలా మంది హీరోయిన్లు క‌ల‌లు కంటారు. ఎన్నారై లను పెళ్లి చేసుకుని వేరే దేశాల్లో స్థిరపడుతుంటారు. అలా ఎన్నారైలను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అందాల తార మీరాజాస్మిన్ గుడుంబా శంకర్, భద్రా, గోరింటాకు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా తమిళ మలయాళ భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. అయితే మీరా జాస్మిన్ 2014 లో దుబాయ్ కి చెందిన మలయాళ టెకీ అనిల్ జాన్ ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.
నటి గోపిక తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. అయితే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.  ఇక గోపిక 2008లో ఎన్నారై డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అమీ, కుమారుడు ఐడెన్ ఉన్నారు. ప్రస్తుతం కుటుంబం తో కలిసి గోపిక ఆస్ట్రేలియా లో ఉంటుంది.
స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లయ. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా లయ 2006లో ఎన్నారై డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.  లయ కుటుంబం తో కలిసి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో నివాసం ఉంటుంది.
 టాలివుడ్ అందాల తారల్లో పరిచయం అక్కర్లేని పేరు రంభ. ఎన్నో సినిమాల్లో నటించిన రంభ 2010లో తిరుమల దేవస్థానంలో ఇంద్రన్  పద్మనాథన్ అనే ప్రముఖ వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
తెలుగు తో పాటు తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి మాధవి. దాదాపు 300 చిత్రాల్లో నటించిన మాధవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాతృదేవోభవ అనే సినిమాతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకుంది. 1986లో జర్మనీకి చెందిన రాల్ఫ్ శర్మ అనే వ్యాపారిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉండగా ప్రస్తుతం వీరు న్యూజెర్సీలో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: