వావ్, వాటే మాస్క్ మేడమ్ : ఫ్యాన్స్ ని థ్రిల్ చేసిన అనుపమ .... !!

GVK Writings
టాలీవుడ్ లో ప్రస్తుతం తన ఆకట్టుకునే అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలిచి మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న నటీమణుల్లో యువ నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. కేరళకు చెందిన ఈ భామ తొలుత మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాలో నటించి తద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ మూవీలో ఒక ముఖ్య పాత్ర లో నటించి తెలుగు ఆడియెన్స్ ను కూడా ఎంతో ఆకట్టుకుంది.
ఆ సినిమా అనంతరం నాగచైతన్య హీరోగా నటించిన తెలుగు మూవీ ప్రేమమ్ లో కూడా హీరోయిన్ గా నటించి ఆ మూవీతో కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు అనుపమ. ఇక అక్కడినుండి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగింది. ఇక ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులతో టచ్ లో ఉంటూ తన సినీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు.
కొన్నాళ్లుగా కరోనా మనదేశంలో విలయ తాండవం చేస్తూ ఉండడంతో ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఎల్లవేళలా మాస్క్ లు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్త వహించాలని కోరుతూ అనుపమ ఇటీవల పోస్టులు పెడుతున్నారు అనుపమ. ఇక నేడు అనుపమ గులాబీ పువ్వు గల మాస్క్ ధరించి అందర్నీ ఒకింత థ్రిల్ కి గురి చేసారు. ఇక ఆ ఫోటో చూసిన పలువురు అభిమానులు వావ్ వాటే మాస్క్ మేడం అదిరింది అంటూ అనుపమ పై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రజల్లో మాస్క్ ల పట్ల అవగాహనా కోసం అనుపమ్ ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది..... !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: