'తాజ్ మహల్' నుండి ప్రేక్షకుల హృదయాల వరకు.. చంద్రబోస్ ప్రస్థానం మహాద్భుతం?
అయితే నేడు చంద్రబోస్
పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన కెరీర్ గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఇక ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే చంద్రబోస్ గేయ రచయితగా అవకాశం దక్కించుకున్నాడు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్మహల్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు చంద్ర బోస్. ఇక ఈ సినిమా హిట్ కావడం అదే సమయంలో ఇంజనీరింగ్ పూర్తి కావడంతో ఇక పూర్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అప్పటి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ఇక ఆనాటి నుంచి నేటి వరకు ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి.
ఒక సామాన్య ఆలోచింపజేసే పాటలు ఎన్నో అంతేకాదు తెలుగు సంస్కృతిని తెలిపే పాటలు కూడా ఎన్నో ఆయన కలం నుంచి జాలువారాయి.. ఇక అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే నా ఆటోగ్రాఫ్ సినిమాలోని గుర్తుకొస్తున్నాయి లాంటి ఎన్నో సాంగ్స్ కూడా రాశారు సుభాష్ చంద్రబోస్. ఇలా స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలకు కూడా ఎన్నో గేయాలను అందించిన చంద్రబోస్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. చంద్రబోస్ ఏదైనా సినిమాలో రచయితగా పాటలు అందించారు అంటే ఆ పాటలు అద్భుతంగా ఉంటాయి అని సినీ ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉంటారు. అంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబోస్. నేడు చంద్రబోస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు సినీ ప్రముఖులు చంద్రబోస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.