మాకు మాట, నడక, నడత నేర్పిన మాతృమూర్తికి ఎప్పటికీ రుణపడి ఉంటాను : మోహన్ బాబు

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరని చెప్పక తప్పదు. తన కెరీర్ మొదట్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఆయా పాత్రల్లో తన అద్భుత నటనతో ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక డైలాగ్ డెలివరీలో ఇప్పటికీ కూడా మోహన్ బాబు కొట్టే మరో నటుడు లేడు అంటే అది నిజంగా అతిశయోక్తికాదేమో. ఆవిధంగా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో డైలాగ్స్ చెప్తుంటారు మోహన్ బాబు.
ఇక హీరోగా కూడా మోహన్ బాబు నటించిన అనేక సినిమాలు భారీ సక్సెస్ లు అందుకుని ఆయనకు మంచి క్రేజ్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన తనయులు విష్ణు, మనోజ్ లతో పాటు తనయ మంచు లక్ష్మి కూడా టాలీవుడ్లో నటులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు గల మోహన్ బాబు తన జీవిత ఎదుగుదల గురించి ఈ విధంగా చెప్తూ ఉంటారు. కెరీర్ మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు సాగుతున్న సమయంలో తన గురువు దాసరి నారాయణ రావు గారి ఆశీస్సులతో మంచి అవకాశాలు అందుకుని నేడు ఈ స్థాయికి చేరానని చెప్తుంటారు.
ముఖ్యంగా తన జీవితంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎప్పటికీ మరిచిపోలేనని, అలాగే తన మాతృమూర్తి అయిన లక్ష్మమ్మ కి చెవులు వినపడవని, అయినప్పటికీ కూడా ఆమె ఐదుగురు సంతానమైన మా అందర్నీ ఎటువంటి కష్టం రాకుండా ఎంతో జాగ్రత్తగా మాకు మాట, నడక, నడత నేర్పి కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుకు వచ్చారని ఆమెకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంటూ నేడు మాతృ దినోత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన తల్లి లక్ష్మమ్మ కు ప్రత్యేకంగా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మోహన్ బాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది.... !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: