సౌందర్య ట్విస్ట్.. షాక్ లో డాక్టర్ బాబు?

Satvika
కార్తీక దీపం సీరియల్ కు ఆదరణ మాములుగా లేదని చెప్పా లి..  గత కొన్ని రోజుల ముందు దీప, కార్తిక్ కలుసుకోలేద నే ఆలోచనలో జనాలు ఉన్నారు.. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్న కూడా వీరిద్దరి మద్య సఖ్యత లేదు.. దీప ఆరోగ్యం కోసం కార్తిక్ బాబు ప్రయత్నిస్తున్నారు. కానీ దీప మాత్రం కార్తిక్ మనసును నొప్పిస్తునే ఉంది.. దీప మొండితనం చూసి కార్తీక్‌ అసహనం కోల్పోతాడు. ‘అందరిని బద్ద శత్రువుల్లానే చూస్తోంది. ఏం కోరుకుంటుందో, ఇంకా ఏం ఆశిస్తుందో నాకు తెలియదు.

పిల్లల కోసం ఓపిక పడుతున్నాను. వారి మొహం చూసి భరిస్తున్నానని.. ఇంకా నన్ను రెచ్చగొడితే..’ అంటూ ఆగిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు సౌందర్య ను దీప ఎత్తిపొడిచెలా మాట్లాడుతుంది..  నీ కొడుకు బాగానే ఉన్నారు.. కానీ, నేనే ఎవరికీ అక్కర్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..  వెంటనే సౌందర్య కార్తిక్ దగ్గరకు వెళ్ళి.. దీపకి నిజం చెప్తే మంచిదేమో అంటుంది.. దాంతో కార్తిక్ షాక్ అవుతాడు..దీప ఆత్మగౌరవం చూసి అత్తగా కంటే తల్లిగా దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నువ్వు ఇక బతకవే అని చెప్పే ధైర్యం నాకు లేదురా అంటు కన్నీటి పర్యంతరం అవుతుంది. అంతేగాక కార్తీక్‌కు మరో ట్వీస్ట్‌ ఇస్తుంది.

కట్ చేస్తే.. మోనిత మరో ప్లాన్ చేస్తుంది.మోనిత అక్కడే ఉండి కూడా తను వచ్చినట్లు కార్తీక్‌కి చెప్పోద్దని చెబుతుంది. ఇక భారతి ఫొన్‌ లిఫ్ట్‌ చేయగానే కార్తీక్‌ క్లీనిక్‌ నుంచి బయలుదేరావా? అని అడుగుతాడు. ఇప్పడే బయలుదేరబోతున్నానంటుంది భారతి. అయితే నా క్లీనిక్‌ దారి మధ్యలోనే కదా నువ్వు వస్తే నీతో ఓ విషయం చెప్పాలంటాడు. దానికి భారతి అరగంటలో వస్తానని చెప్పి ఫోన్‌ పెట్టెస్తుంది..ఇలా ఈ విషయాన్ని దీపకు ఎలా నిజం చెప్పాలని అనుకుంటుంటే దీప మాత్రం దూరంగా ఉంటే బెస్ట్ అని బ్యాగ్ సర్దుకొని వెళ్ళడానికి సిద్దం అవుతుంది.. దీప కు నిజం తెలుస్తుందా? లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: