త‌మిళ స్టార్ వ‌ద్ద‌కు ప‌వ‌ర్ స్టార్ క‌థ‌.. !

MADDIBOINA AJAY KUMAR
సినిమా పరిశ్రమలో ఒక హీరో నో చెప్పిన కథలు మరో హీరో వద్దకు వెళ్లడం సాధారణమే. అయితే తాజాగా టాలీవుడ్ హీరో నో చెప్పిన కథ తమిళ హీరో వద్దకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. వకీల్ సాబ్ విజయం తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు మరో సినిమాను నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వంశీ పైడిపల్లి పవన్ కోసం ఒక కథ కూడా రాసుకున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపించింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు అదే కథ తమిళ స్టార్ హీరో విజయ్ వద్దకు వెళ్లిందట.  అంతే కాకుండా వంశీ పైడిపల్లి చెన్నై కి వెళ్లి తలపతి విజయ్ కి కథను కూడా వినిపించారట. విజయ్ కి కథ నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళుతుందని దిల్ రాజు వెల్లడించారు. ఇదిలా ఉండగా విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది.

ఇక విజయ్ తన తరవాత సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేయబోతున్నారు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది . సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుంది. మరోవైపు మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై కూడా విజయ్ ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ రెండు సినిమాల తరవాత విజయ్-వంశీ ల కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: