ఈ ఏడాదీ సమ్మర్ సంబరాలు మిస్..!

MADDIBOINA AJAY KUMAR
సంక్రాంతి తరవాత ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేది సమ్మర్ లోనే. ఎందుకంటే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు రావడంతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా సెలవులు తీసుకుంటారు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మర్ లో ఎక్కువ సినిమాలను విడుదల చేస్తారు. అంతే కాకుండా ఎండాకాలంలో భయట తిరగాలి అని ఎవరూ అనుకోరు..కానీ థియేటర్ కు వెళ్లి చల్లగా చిల్ అవ్వాలని కోరుకుంటారు. అయితే గతేది కరోనా కారణంగా థియేటర్ లు మూతపడటంతో సమ్మర్ లో సినిమాలు రిలీజ్ అవ్వలేదు. మార్చ్ లో లో లాక్ డౌన్ రావడంతో సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. ఇక కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తరవాత మెల్లి మెల్లిగా థియేటర్ లు తెరుచుకున్నాయి. దాంతో క్రాక్, జాతిరత్నాలు, ఉప్పెన లాంటి సినిమాలు విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఇప్పుఫు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రూపం లో ఎంట్రీ ఇచ్చింది. 
అయితే ప్రభుత్వం థియేటర్లు మూసేయాలని ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు కానీ  50శాతం సీటింగ్ తో నడపాలని ఉత్తర్వులు జారీచేసింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా చూడ్డానికి జనాలు వచ్చేలా లేరని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాయి. దాంతో థియేటర్ యాజమాన్యాలు కూడా చేసేది లేక థియేటర్ లను దాదాపు మూసేసారు. దాంతో ఈ సమ్మర్ కూడా సినీ ప్రియులకు నిరాశగానే మారింది. అంతే కాకుండా ప్రొడ్యూసర్ లు, నిర్మాతలు, థియేటర్ ల యాజమాన్యాలకు కూడా ఆదాయం లేకుండా పోయింది. ఇక గతేడాది సమ్మర్ లో థియేటర్ లు లేకపోవడం తో ఓటీటీ హవా కనిపించింది. చాలా సినిమాలు ఓటీటీ లో విడుదలై మంచి విజయం అందుకున్నాయి. వాటిలో కలర్ ఫోటో, ఉమామహేశ్వర ఉగ్రరూపాస్య సహా మరి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలతో ఓటీటీ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయి. దాంతో ప్రేక్షకుల కళ్ళు కూడా ఇప్పుడు ఓటీటీ వైపే చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: