పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన సూపర్ స్టార్....
పవన్ త్వరగా కోలుకోవాలని మహేష్ కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా మహేష్ ఈ కామెంట్ చేశారు.ప్రస్తుతం మహేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్ననే వకీల్ సాబ్ సినిమా గురించి ట్వీట్ చేసిన మహేష్ తాజాగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చెయ్యడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని ఇస్తుంది. ఇక అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ పవన్ కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యునైటెడ్ టాలీవుడ్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఆయన రీఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. అయితే ఈ చిత్రంలో పవన్‌తో పాటు నటించిన నివేదా థామస్‌కు ఇటీవలే కరోనా సోకింది.ఇప్పుడు పవన్‌కు పాజిటివ్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినిమా హిట్టయి సంతోషంలో ఉండాల్సిన సమయంలో ఇలా పవన్‌కు కరోనా సోకడం బాధాకరమని వాళ్లు అంటున్నారు.పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్ధిస్తున్నారు.