వామ్మో.... మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ అదా ....వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కి పండగే .....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఆయనకు జోడీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరశురామ్ తీస్తుండగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఇది ఎంతో భారీ లెవెల్లో నిర్మితం అవుతోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తుండగా మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మహేష్ తో తొలిసారిగా చేస్తున్న మూవీ కావడంతో దర్శకుడు పరశురామ్ ఈ మూవీ యొక్క కథ, కథనాలను ఎంతో జాగ్రత్తగా రాసుకున్నట్లు చెప్తున్నారు.
మంచి మెసేజ్ తో పాటు పక్కాగా కమర్షియల్ జానర్ లో ఈ మూవీ సాగుతుందని, అలానే ఇందులో మహేష్ బాబు ఒక ఫైన్షియర్ గా కనపడనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని దుబాయ్ లో జరుపుకున్న ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలోని ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్న ఈ సినిమా 2022 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పై పూర్తిగా దృష్టి పెట్టిన మహేష్ బాబు, వీలైనంత త్వరలో దీనిని పూర్తి చేసి ఆ పై త్రివిక్రమ్ మూవీ షూట్ లో జయిన్ అవ్వాలని చూస్తున్నారట. అలానే ఈ సర్కారు వారి పాట తదుపరి మరొక రెండు షెడ్యూల్స్ కూడా హైదరాబాద్ లోనే జరుగనున్నాయట.
ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతుండడంతో వేరే ప్రాంతాలకు వెళ్లి షూట్ చేసే బదులు అవకాశం ఉన్నంతవరకు హైదరాబాద్ లోనే ప్రత్యేక సెట్స్ రూపొందించి దానిని పూర్తి చేస్తే బెటర్ అనేది మహేష్ ఆలోచన అని, దాని వలన అనుకున్న దానికంటే ఒకింత ముందే సినిమా కంప్లీట్ చేయవచ్చని ఆయన భావిస్తున్నారట. మొత్తంగా హీరో మహేష్ బాబు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ నిజంగా ఎంతో బాగుందని, వర్కౌట్ అయి సినిమా కూడా సూపర్ హిట్ కొడితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: