ఎన్టీఆర్ కోసం మరొకసారి ఆమెనే తీసుకుంటున్న కొరటాల .... ??

GVK Writings
 యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరొక పాత్ర చేస్తుండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రకని, శ్రియా శరణ్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ పాన్ ఇండియా సినిమాగా పేట్రియాటిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్ 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొరటాల స్థానంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉండగా అది కొన్ని కారణాల వల్ల ఇటీవల క్యాన్సిల్ అయింది. అయితే ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేసిన కొరటాల అందులో ఆయన పాత్రని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన జనతాగ్యారేజ్ ని మించే విధంగా ఈ మూవీ రూపొందనుందని అంటున్నారు.
యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై నిర్మితం కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటి కియారా అద్వానీ ని ఎంపిక చేశాడట దర్శకుడు కొరటాల. గతంలో మహేష్ బాబు తో కొరటాల తెరకెక్కించిన భరత్ అనే నేను మూవీ ద్వారా టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది కియారా. అయితే ఆ సినిమాలో ఆమె నటనకు మెచ్చిన కొరటాల మరొకసారి ఎన్టీఆర్ మూవీ కోసం ఆమెను తీసుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: