వామ్మో .... అది కూడా వాయిదానా .... ??
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కొన్నాళ్ల క్రితం పూర్తి అయింది. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా ఈ మూవీ కూడా భారీ సక్సెస్ అందుకని వెంకటేష్ కి కెరీర్ పరంగా మరో విజయయాన్ని అందించడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా కొనసాగుతుండటంతో ఇప్పటికే ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక దానివెంట ఎం,మరొకటి కొన్నాళ్లపాటు వాయిదాలు పడుతున్నాయి. మరోవైపు నారప్ప తో పాటు రానున్న ఆచార్య కూడా వాయిదా పడే ఛాన్స్ కనపడుతుంది. అలానే నారప్ప ని కూడా వాయిదా వేయాలని యూనిట్ ఆలోచన చేస్తోందని అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి సరికొత్త విడుదల తేదీని యూనిట్ ప్రకటించిందని చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!