ఊహించని పాత్రలో రాశికన్నా.. అభిమానులకు సర్ప్రైస్ ఉండబోతుందా ..?

praveen
తెలుగు చిత్రపరిశ్రమలో రాశి కన్నా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు. మొదట్లో కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే పరిమితమైన రాశికన్నా ఆ తర్వాత గ్లామర్ డోసు కూడా పెంచుతూ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులు అలరించి తన వైపుకు తిప్పుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ అమ్మడు.  అయితే కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు అందుకున్న రాశి కన్నా ఆ తర్వాత మాత్రం కాస్త అవకాశాలకు దూరమైపోయింది.



 కానీ ప్రస్తుతం మరో సారీ వరుసగా అవకాశాలు వస్తున్నాయి ఈ అమ్మడుకి. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న రాశి కన్నా ఇప్పుడు సన్నజాజిలా గా మారిపోయింది. అదే సమయంలో తన హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలు  సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది  రాశిఖన్నా.  అంతేకాకుండా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే రాశి ఖన్నా ఇటీవలే పండగ చేస్కో అనే సినిమా లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. ఈ సినిమాలో టిక్ టాక్ బానిస అయిపోయిన ఒక యువతి పాత్రలో నటించి అందరిని మెప్పించింది రాశిఖన్నా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రాశిఖన్నా మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్టయ్యింది.



 ఇకపోతే మరోసారి రాశిఖన్నా ఒక విభిన్నమైన రోల్లో నటించేందుకు సిద్ధం అవుతుంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తుంది రాశిఖన్నా. అయితే ఈ సినిమాలో కూడా సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి రోజు పండగే సినిమాలో రాశి కన్నా టిక్ టాక్ స్టార్ గా చూపించిన దర్శకుడు మారుతీ ఇక ఈ సారి మరింత సరికొత్త పాత్రలో చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాఖీ పాత్ర ఎలా ఉండబోతుందో అని ఆ ప్రేక్షకులలో ఆతృత పెరిగి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: