2021 ప్రథమార్థం వకీల్ సాబ్ దేనా...?

VAMSI
2020 లో మెగా అల్లుడు రికార్డులు బద్దలు కొట్టి విజేతగా నిలిస్తే..ఇపుడు 2021 లో మెగా హీరో రికార్డుల మోత మోగిస్తున్నాడు. అల వైకుంఠపురములో...సినిమాతో 2020 లో సంక్రాంతి బరిలోకి దిగి  బ్లాక్ బాస్టర్ అందుకొని  కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించాడు మెగా అల్లుడు అల్లు అర్జున్. క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా 2020 లో ది బెస్ట్ గా నిలిచాడు బన్నీ. అయితే ఇప్పుడు 2021 లో వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రికార్డులను బద్దలు కొడుతున్నాడు. పాటల పరంగా కూడా ఈ సినిమా గొప్ప క్రేజ్ ను అందుకుంది. 


ఓ వైపు కొవిడ్ విజృంభణ కొనసాగుతున్నా, సినిమాలో కంటెంట్ బాగుంటే ఆగేది లేదంటూ థియేటర్లకు దూసుకుపోతున్నారు ఆడియన్స్. ఇప్పటికే ఈ ఏడాదిలో విడుదలైన మెగా హీరో వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన, నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు, అల్లరి నరేష్ కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాంది వంటి సినిమాలు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లు గా నిలిచి ప్రూవ్ చేశాయి. అయితే స్కేల్ పరంగా అవన్నీ మీడియం రేజ్ అయితే వకీల్ సాబ్ భారీ చిత్రం. ఇది పెద్ద స్థాయి కలెక్షన్లను కలెక్ట్ చేస్తోంది.. బాక్సాఫీస్ వద్ద పవన్ వకీల్ సాబ్  పవర్  బ్యాక్ అని తన సత్తా చాటుతోంది.


2021లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందన్న అంచనా ఇప్పటికే ఏర్పడింది. అన్నిటినీ మించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఇలా గత ఏడాది 2020 లో అల్లు అర్జున్..అలా వైకుంఠపురంలో చిత్రంతో  టాప్ లో నిలవగా..ఇపుడు పవర్ స్టార్ 2021 లో తన పవర్ చూపిస్తున్నారు.
వకీల్ సాబ్ చిత్రంలో అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి...పవర్ఫుల్ కంటెంట్ తో అభిమానుల ఎదురుచూపులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు కళ్యాణ్. ఇక ముందు ముందు ఎన్నెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: