తారక్ చేత ఆ సన్నివేశాలను పలుమార్లు చేయించిన రాజమౌళి..?

Suma Kallamadi
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. రామ్ చరణ్, అజయ్ దేవగన్, జూనియర్ ఎన్టీఆర్, అలియాభట్ వంటి అగ్ర నటీనటులతో సహా ఇంటర్నేషనల్ స్టార్స్ అయిన ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్ మరియు అల్లిసన్ డూడీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలి వంటి గొప్ప చిత్రం తర్వాత భారీ తారాగణంతో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంటుండగా.. ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి రాజమౌళి తన సినిమా షూటింగ్ ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా లెక్క చేయరు కానీ పర్ఫెక్షన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అవసరమైతే మొత్తం సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయడానికైనా రెడీ అవుతారు.



అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా పలుమార్లు రీషూట్ చేశారట. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అండర్ వాటర్ సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలని రాజమౌళి మొత్తం 3 సార్లు షూట్ చేశారట. అయితే ఎన్టీఆర్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు అండర్ వాటర్ సన్నివేశాన్ని షూట్ చేసిన తర్వాత రాజమౌళి సంతృప్తి పడ్డారట. ఎనర్జిటిక్ గా ఉండే ఎన్టీఆర్ కూడా రాజమౌళికి కావాల్సినట్టుగా సన్నివేశాన్ని అద్భుతంగా మలిచేందుకు కొంచెం కష్టమైనా సరే తన వంతు కృషి చేశారట. అయితే సినిమాలో ఎన్టీఆర్ అండర్వాటర్ సన్నివేశం హైలెట్ కానుందని సమాచారం.



రీ షూట్ చేయడానికి సమయంతో పాటు డబ్బు ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ రాజమౌళి వెనకడుగు వేయడం లేదు. కరోనా కారణంగా  ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైనప్పటికీ.. త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన రాజమౌళికి అసలు రావడం లేదట. రూ. 450 కోట్ల బడ్జెట్ తో చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతోంది  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: