పిఠాపురం : పవన్ కళ్యాణ్ కోసం టాలీవుడ్ హీరోయిన్ రహస్య పూజలు ?

Veldandi Saikiran
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పిఠాపురం నియోజకవర్గంలో  ఈసారి కచ్చితంగా గెలవబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఖరారు చేశాయి. అటు పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి సభ్యులు కూడా పిఠాపురం విజయం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు వర్మ.... పవన్ కళ్యాణ్ విజయం కోసం చాలా కష్టపడ్డారట.


 ఈ నేపథ్యంలోనే వైసీపీ అభ్యర్థి వంగ గీతాపై పవన్ కళ్యాణ్ కు 40 వేల మెజారిటీ వరకు వచ్చే ఛాన్స్ లు ఉన్నట్లు ఇప్పటికే చాలా సర్వేలు స్పష్టం చేశాయి. దాదాపు పవన్ కళ్యాణ్ విజయం ఖరారు అయినట్లు అన్ని సర్వేలు తేల్చి చెప్పేశాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు పవన్ కళ్యాణ్ విజయం ఖరారు కానుందట. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయం పై ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
.

 
 పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  లక్ష మెజారిటీ తో విజయం సాధించాలని... టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోయిన్ పూజలు చేస్తున్నారట. ప్రముఖ పండితులతో... రహస్యంగా ఓ యాగం కూడా ఆమె నిర్వహిస్తున్నారట. ఈ విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ టాలీవుడ్ హీరోయిన్ కు చాలా ఇష్టమట. ఆమె ఫేవరెట్ హీరో కూడా పవన్ కళ్యాణ్ అని సమాచారం.

 
 అందుకే  2019 ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్... ఈసారి కచ్చితంగా గెలవాలని... ఆమె పూజలు చేస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే దీనిపై నెటిజెన్స్ తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు అక్కడ గెలవడని... వైసిపి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే.. ఆ అందమైన హీరోయిన్ ఎవరు అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఇలా ఉండాలి రా... అంటూ మరి కొంత మంది స్పందిస్తున్నారు. మొత్తానికి.. పిఠాపురం నియోజకవర్గ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆరా మస్తాన్ సర్వే కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: