చంద్రబాబు మోసం చేసినా.. నందమూరి ఫ్యామిలీకి మేలు చేసిన టీడీపీ నేత..??

Suma Kallamadi
సాధారణంగా ఒక పార్టీ కోసం పనిచేసే ఆ పార్టీలోనే నమ్మకంగా ఉండే వారికి అధిష్టానం టికెట్ ఇవ్వాలి. పార్టీని బలోపేతం చేసి పార్టీ కోసమే జీవితాన్ని అంకితం చేసిన వారికి టికెట్ ఇవ్వకపోతే అది మోసం చేసినట్లే అవుతుంది. టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ విషయంలో సరిగ్గా అదే జరిగింది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని మోహనకృష్ణ ఎంతో ఆశించారు కానీ కూటమి అతనికి టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో మాధవికి టిక్కెట్టు దక్కడంతో ఆయన చాలా దిగులు చెందినట్లు తెలిసింది. అయితే ఆ కారణం చేత ఆయన టీడీపీ నుంచి దూరం కాలేదు. మోసం చేసిన నారా, నందమూరి ఫ్యామిలీకి  ఆయన మేలే చేశారు.


తాజాగా మన్నవ మోహనకృష్ణ ఎన్టీఆర్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్ల విరాళాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అందజేశారు. టికెట్ ఇవ్వకపోయినా ఆయన చాలా పెద్ద విరాళం అందజేసి మరోసారి తన లాయల్టీని చాటుకున్నారు. అయితే, పార్టీ గెలిస్తే ఓ కీలక పాత్ర ఇస్తానని చివరగా చంద్రబాబు హామీ ఇచ్చారట. ఇకపోతే ఈయన చేసిన డొనేషన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


మరోవైపు రేపే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జగన్, చంద్రబాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. మొన్నటిదాకా విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైం గడిపారు. ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి బూత్ ఏజెంట్లకు ముఖ్య సూచనలను చేస్తున్నారు. జగన్ అప్పుడే ప్రమాణం స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టేసారని సమాచారం. ఫుడ్ మెనూ కూడా రూపొందించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసే వారందరినీ సమీకరించారట. జూన్ ఒకటవ తేదీన రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారనే దానిపై సరిగా క్లారిటీ ఇవ్వలేదు. ఆ కారణంగా ఏపీ ప్రజలు గెలుపు ఎవరిది అనేది తెలుసుకోవడానికి మరో కారణం 24 గంటలు వెయిట్ చేయక తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: