జగన్: ఫలితాలకు ముందే మరో అరుదైన రికార్డ్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి.. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను నేతలను సైతం ఆందోళన అయ్యలా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫలితాల ముందే సీఎం జగన్ మరొక రికార్డును సైతం సృష్టించారు.. నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు అక్షరాల 1815 రోజులు మాత్రమే పని చేశారు. 2019 మే 30 వ తేదీన సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల సీఎం జగన్ ఐదేళ్లు తన పాలనను పూర్తి చేసుకున్నారు. రేపటి రోజున వైసీపీ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్ సీఎం అవుతారు..లేకపోతే తదుపరి సీఎం జూన్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకు జగన్ సీఎం గా ఉంటారు.. అయితే సీఎం జగన్ జూన్ 11న ప్రమాణ స్వీకారం చేస్తే..1835 రోజులు పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేసిన వ్యక్తిగా జగన్ మరో అరుదైన రికార్డును అందుకుంటారు.

ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తున్నారు. కచ్చితంగా వైసీపీ పార్టీ వస్తుందని ధీమా అధినేతలలో కార్యకర్తలలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో సర్వేలు సైతం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తెలియజేశాయి ముఖ్యంగా ఆరా మస్తాన్ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో చాలా ధీమాతో ఉన్నారు. అయితే కూటమి కూడా అంతే ధీమాని వ్యక్తం చేస్తున్నది. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి పార్టీలు కలవడంతో కచ్చితంగా ఓటింగ్ ప్రక్రియ తమకే ఎక్కువగా జరిగి ఉంటుందని ప్రెడిక్షన్  ని కూడా తెలియజేస్తున్నారు. మరి రేపటి రోజున ఏం జరుగుతుందో చూడాలి ఎవరు ప్రజలు సీఎంగా ఎంచుకుంటారో మరి. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏవిధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: