OG: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కోలుకోలేని దెబ్బే?

Purushottham Vinay
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజి ' సినిమా ఒకటి. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక సుజిత్ ఇప్పటికే రన్ రాజా రన్, సాహో మూవీలతో  ఒక భారీ సక్సెస్ అయితే అందుకున్నాడు. సాహో తెలుగులో ప్లాప్ అయినా బాలీవుడ్ లో మాత్రం కుమ్మింది. కాబట్టి అక్కడ సుజిత్ కి సాహోతో మంచి మార్కెట్ అయితే ఉంది.ఇంక దాంతో పవన్ కళ్యాణ్ తో చేయబోయే ఓజి సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ప్రొడ్యూసర్ డివివి దానయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయినా కానీ మధ్యలో ఎలక్షన్స్ రావడం కారణంగా ఈ సినిమా అనుకున్న డేట్ కైతే వచ్చే విధంగా కనిపించడం లేదు. దానివల్లే అభిమానులు ఎంతో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.


ఇక ప్రస్తుతం ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్ రానున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నాడు అనే వార్తలైతే బాగా వస్తున్నాయి.ఇక తన రాజకీయ గెలుపుని ఎంజాయ్ చేస్తూ మరొక నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకి హాజరు కాలేడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జులై 10వ తేదీ నుంచి సినిమా షూటింగుల్లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఓజీ మూవీ షూటింగ్ అనుకున్న డేట్ కి పూర్తయిపోయి అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా అంటే మాత్రం సినిమా మేకర్స్ లో చాలావరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. OG సినిమా వాయిదా పడటం వల్ల ఆ డేట్ కి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా ఇంకా అలాగే తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ అమరన్ ఆ డేట్ కి రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: