ఎన్టీఆర్, నీల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఏ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఆగస్ట్ చివరి నెల నుండి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. అంతేకాదు ప్రశాంత్ తన డ్రీం ప్రాజెక్టు కథతో ఈ సినిమాని తీస్తున్నారు అని ఇదివరకే చెప్పాడు. దీంతో దీనిపై తారా స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో

 భాగంగానే ఇప్పుడు సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. ఎప్పుడు విడుదల చేస్తారో.. అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అందుకే సినిమాకు సంబంధించిన ఏవో ఒక వార్తలో నిత్యం సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంటాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో హీరోయిన్గా ఎవరిని ఫిక్స్ చేసారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించబోయే అందాల తార ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు

 తెలుసుకుందాం.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందనా ను హీరోయిన్గా తీసుకోవాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప యానిమల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా  పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాలో కూడా ఈ అమ్మడిని తీసుకుంటే బాగుంటుంది అని ప్రశాంత్ ఎన్టీఆర్ రష్మిక మందనా ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. అందుకే దీనిపై ఎప్పుడు ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: