ఎన్టీఆర్, నీల్ మూవీ ఇండియాలోనే విలువైన ప్రాజెక్ట్ అట?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందబోతున్న సంగతి తెల్సిందే. ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ నుంచి ఇదే ఏడాది సినిమా ప్రారంభం కాబోతుంది అంటూ వచ్చిన ప్రకటన అందరి దృష్టిని కూడా ఎంతో ఆకర్షించింది.వీరిద్దరి కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు దాదాపు మూడు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ను ఈ ఏడాదిలో ప్రారంభించబోతున్నాం అంటూ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రకటనతో ఫ్యాన్స్‌ బాగా హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో సినిమా గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. అయితే కొన్ని పుకార్లలో కొంత నిజం ఉందేమో అనిపిస్తూ ఉంది. తాజాగా వినిపిస్తున్న రెండు పుకార్లు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉన్నాయని తెలుస్తుంది. 


ఈ రెండు పుకార్లు నిజం అవ్వాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటారు. ఇంతకు ఆ పుకార్లు ఏంటి అంటే.. మొదటిది ఈ సినిమాలో ఎన్టీఆర్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ చూపించే విధంగా స్టోరీ ఉంటుందట. ఒక పాత్ర మరీ వైల్డ్‌ గా ఉండటంతో పాటు కాస్త నెగటివ్‌ టచ్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్‌ కి జోడీగా ఒక హీరోయిన్ గా కియారా అద్వానీ నటించబోతుందట. ఈ రెండు పుకార్లు సినిమా పై జనాల్లో ఎంతో ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. పైగా ఈ సినిమా ఇండియాలోనే అత్యంత విలువైన సినిమాల్లో ఒకటిగా నిలవనుందట. ఈ సినిమాని ఏకంగా 15 దేశాల్లో షూట్ చేసి విడుదల చెయ్యనున్నారు. ఆకట్టుకునే విధంగా వీరి కాంబో ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మెక్సికోలో ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. ఈ ఏడాదిలో సినిమా ప్రారంభం అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థం కు సినిమా విడుదల అవ్వడం ఖాయం అని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: