సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

praveen
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలన్నా యూట్యూబ్ పై ఆధార పడుతున్నారు. అయితే యూట్యూబ్లో ఇక అన్ని రకాల విషయాలపై కూడా పూర్తి సమాచారం ఉండటంతో ప్రతి ఒక్కరు యూట్యూబ్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.. అయితే ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది యూట్యూబ్. ఇక నటనపై ఆసక్తి ఉన్న వారు యూట్యూబ్ వేదికగా తమ సత్తా చాటుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది యువతీ యువకులు యూట్యూబ్ ని తమ అస్త్రం గా మార్చుకొని తమలోని నట్టున్ని నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఇక అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు.



 ఇలా వివిధ రకాల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఏకంగా సరి కొత్త కంటెంట్తో తన యాస భాషతో నెటిజన్లు అందరిని ఆకర్షించి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు పక్కింటి కుర్రాడు. పక్కింటి కుర్రాడు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చందు సాయి..  తనలోని టాలెంట్ ని అందరికీ నిరూపించుకున్నాడు. అయితే యూట్యూబ్ లో ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు సినిమాల్లో మాత్రం అంతగా కనిపించలేదు.



 కానీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక సన్నివేశంలో కనిపిస్తాడు చెందుతాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్ రాజు విజయశాంతి మహేష్ బాబు మధ్య జరిగే ఒక కీలక సన్నివేశంలో కనిపిస్తాడు చందు సాయి. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా లో తన ఫ్రెండ్ ద్వారా అవకాశం వచ్చిందని ఇక ఆ సినిమాలో ఐదు రోజుల షూటింగ్ జరిగే ప్రతి రోజు 15000 రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో అవకాశం రాగానే తన పాత్ర ఎలా ఉంటుందో అని ఎంతో టెన్షన్ పడ్డాను అని కానీ ఆ తర్వాత టెన్షన్ తగ్గింది అంటూ తెలిపాడు. ఇక అవకాశాల కోసం తిరిగేంత సమయం ఉండదు అందుకే కూడా సినిమాలో కనిపించను అంటూ చెప్పుకొచ్చాడు చందు సాయి  .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: