ఆ దర్శకుడి సీక్రెట్ చెప్పిన సీనియర్ నటి రేఖ...!

VAMSI
ఈ మధ్య కాలంలో రియాలిటీ షో యొక్క సందడి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నాయో తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చూస్తే ప్రధమంగా బిగ్గెస్ట్ రియాలిటీ సింగింగ్ షో అయినటువంటి ఇండియ‌న్ ఐడ‌ల్ మంచి క్రేజ్ ను తెచ్చుకొని విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఈ షో ఇండియన్ ఐడల్ 12 సీజన్ ని జరుపుకుంటోంది. ఈ షో లో హిమేష్ ర‌ష్మియా, నేహా క‌క్క‌ర్, విశాల్ ద‌ద్లానీ జ‌డ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి యాంకర్ గా మొదట ఆదిత్య నారాయ‌ణ ఉండగా కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆయన స్థానంలో జయ్‌ భానుశాలి వస్తున్నారు. అయితే తాజాగా ఈ షో కి ముఖ్య అతిధిగా బాలీవుడ్‌ బాపు బొమ్మ రేఖ వచ్చిన విషయం తెలిసిందే. తన ఎనర్జీతో షో ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేసిన ఈమె... తను ఒకప్పుడు చేసిన పాటలను ఇప్పుడు షో లో విని మంత్ర ముగ్ధులయ్యారు.

ఈ సందర్భంగా రేఖ పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. ఆ పాటలను అప్పట్లో షూట్ చేసేటప్పుడు... సెట్లో ఆమె అనుభవాలను మరోసారి గుర్తు చేసుకొని ఈ సందర్భంగా వాటిని షేర్ చేసుకున్నారు. ఓ సింగర్ ‘ఉమ్రావ్‌ జాన్‌’లోని ‘ఏ క్యా జగా హై దోస్తో’ పాటను పాడగా... అప్పుడు తన ఫీలింగ్స్ ని గుర్తు చేసుకొని ఇలా అన్నారు... అప్పట్లో ఆ పాటకు నేను ఇచ్చిన హావభావాలు గురించి మాట్లాడితే ఆ పాట కోసం అభినయాన్ని ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదని...లతా మంగేష్కర్, ఆశా భోంస్లే పాడేది వింటే చాలు మన మనసు కదిలి హావభావాలు వాటికవే వస్తాయని పేర్కొన్నారు. లక్నోలో ఈ పాట షూటింగ్ సమయంలో... ఎముకలు కొరికే అంత చలిగా ఉంది..గ్లిజరిన్‌ కంట్లో పెట్టుకున్న కన్నీరు రాలేదు.

బహుశా చలికి గడ్డ కట్టిందేమో... కానీ ఎప్పుడైతే ఆ పాట వింటూ షూటింగ్ కొనసాగిందో ఆశాభోంస్లే పాటకు హృదయం కరిగి కన్నీరుగా బయటకు వచ్చిందని ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. అంతేకాదు డైరెక్టర్ హృషికేశ్‌ ముఖర్జీ గురించి కూడా పలు అంశాలను తెలిపారు. ఆయనకు కాస్ట్యూమ్స్ కు ఖర్చు చేయాలి అనుకోలేదు.. అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ‘ఖూబ్‌సూరత్‌’లో నేను నటించేటప్పుడు అది అర్థం చేసుకున్న నేను.. ఇంటి దగ్గరి నుంచి మంచి మంచి డ్రస్సులు వేసుకొని వచ్చేదాన్ని. డైరెక్టర్ వాటిని చూసి ఇవి చాలా బాగున్నాయి... వీటితోనే నటించు లుక్ బాగుంటుంది’ అని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు రేఖ. ఈ షో లో రేఖ చేసిన సందడి చూసినవారంతా  ఆమె వయస్సు 67 ఏమో కానీ, ఆమె చేసే సందడి సందడి, ఆమె అందం ఇప్పటికీ ఏమి మారలేదంటూ ఈమె ఇప్పటికీ స్వీట్ సిక్స్టీన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: