శ్రీను వైట్ల తో ఎన్టీఆర్ సినిమా ..... ఒకవేళ బాద్షా -2 కాదు కదా ....??

GVK Writings
ఇప్పటికే వరుసగా విజయాలతో కెరీర్పరంగా దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తుండగా దర్శక ధీరుడు రాజమౌళి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరిసీతారామరాజు పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందించగా సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపు రూ. 500 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియాభట్ హీరోయిన్లుగా నటిస్తుండగా సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుండగా దీని తర్వాత అతి త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించనున్నారు ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్, సూర్యదేవర రాధాకృష్ణ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే హీరోయిన్ సహా ఇతర నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. కాగా వేగవంతంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్ అటు. మరోవైపు ఈ సినిమా తర్వాత ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో ఒక మూవీ అలానే ఆపై అట్లీ తో మరొక మూవీ ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. గతంలో తనకు బాద్ షా వంటి సూపర్హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారట.
ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ని తన నివాసంలో ప్రత్యేకంగా కలిసిన శ్రీనువైట్ల ఆయనకి ఒక అద్భుతమైన కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ స్టోరీని వినిపించారని అది ఎంతో నచ్చిన ఎన్టీఆర్ దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయండి ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరం చేద్దాం అని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ కూడా బయటకు వస్తుందని ఒక బడా నిర్మాణ సంస్థ దీన్ని ఎంతో భారీ వ్యయంతో నిర్మించనుందని అంటున్నారు. కాగా ఈ సినిమా బాద్షా కి సీక్వెల్ గా బాద్షా 2గా రూపొందనుందని కూడా కూడా ప్రచారం జరుగుతోంది. మరి వీరిద్దరి కలయికలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: