గోల్డెన్ ఛాన్స్ కొట్టిన స్టార్ ప్రొడ్యూసర్ .... ఆయన కు పవర్ స్టార్ మరొక ఛాన్స్ ....??

GVK Writings
టాలీవుడ్ కి నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ మూవీ ద్వారా తొలిసారిగా నిర్మాతగా పరిచయం అయ్యారు రాజు. ఆ విధంగా ఫస్ట్ మూవీ ద్వారానే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు స్థిరపడిపోయింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన దిల్రాజు ఆపై కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నారు. వాస్తవానికి మధ్యలో కొన్ని పరాజయాలు కూడా ఆయనని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆపై ప్రస్తుతం మళ్ళీ మంచి సక్సెస్ ట్రాక్ లో కొనసాగుతున్నారు.
ఇక లేటెస్ట్ గా ఆయన బ్యానర్ పై రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో కూడా ఒకటి వకీల్ సాబ్. తొలిసారిగా తనకెంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎంతో శ్రద్ధ పెట్టిన దిల్ రాజు అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతుండటంతో దీని విడుదలని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో ప్లాన్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతంలో బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ కి రీమేక్ గా రూపొందింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేయగా తమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీస్థాయి అంచనాలు ఉన్నాయి.
అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ తర్వాత అతి త్వరలో మరొకసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దిల్ రాజు మరొక సినిమా చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ఒక యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చెప్పిన కథ ఎంతో అద్భుతంగా ఉందని మెచ్చిన దిల్రాజు ఆపై దానిని పవర్ స్టార్ కి వినిపించమని చెప్పాడా, అది విన్న పవన్ కళ్యాణ్ చాలా బాగుందని ప్రస్తుతం తన కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరం దీన్ని పట్టాలెక్కిద్దాం అని మాట ఇచ్చారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే దిల్ రాజు కి నిర్మాతగా మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: