స‌ల్మాన్ ఖాన్ న‌న్ను మోసం చేశాడు..న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

MADDIBOINA AJAY KUMAR
కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప‌లువురు స్టార్ హీరోయిన్ ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌ల్మాన్ ఖాన్ మొద‌ట‌గా ప్రేమ‌లో ప‌డింది మాత్రం పాకిస్తాన్ న‌టి షోమి అలీ తోనే. షోమీ అలీ న‌టిగా కంటే స‌ల్మాన్ మొద‌టి గ‌ర్ల్ ఫ్రెండ్ గానే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంర్యూలో షోమీ స‌ల్మాన్ ఖాన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తాను స‌ల్మాన్ ఖాన్ కొన్నేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి వ‌స్త‌వ‌మేన‌ని న‌టి వెళ్లడించింది. అంతే కాకుండా స‌ల్మాన్ తో ఆరేండ్లు డేటింగ్ చేశాన‌ని పేర్కొంది.ఆ స‌మ‌యంలో త‌ర‌చూ స‌ల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లేదానిన‌ని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా స‌ల్మాన్ త‌ల్లి తండ్రులు ఎంతో మంచి వార‌ని వాళ్ల ద‌గ్గ‌ర నుండి ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని తెలిపింది. అయితే స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌ర నుండి ఒక్క విష‌యం కూడా నేర్చుకోలేద‌ని చెప్పుకొచ్చింది. స‌ల్మాన్ త‌ల్లి దండ్రులు అంద‌రినీ ఒకేలా చూస్తార‌ని తెలిపింది. ముఖ్యంగా స‌ల్మాన్ ఖాన్ త‌ల్లి చాలా మంచి వార‌ని వెల్ల‌డించింది.
తాను సినిమాల్లోకి వ‌చ్చింది హీరోయిన్ అవ‌కాశాల కోసం కాద‌ని స‌ల్మాన్ ఖాన్ పైన ఉన్న అభిమానంతోనే వ‌చ్చాన‌ని తెలిపింది. స‌ల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకునేందుకే సినిమాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పింది. అంతే కాకుండా ఇద్ద‌రం పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్నామ‌ని కానీ స‌ల్మాన్ ఖాన్ త‌న‌ను మోసం చేసాడని తెలిపింది. ఆ త‌ర‌వాత తాము దూర‌మ‌య్యామ‌ని ఎవ‌రి లైఫ్ లో వారు బిజీ అయ్యామ‌ని తెలిపింది. ఇక ముంబైలో మోడ‌ల్ గా ఉండ‌గానే షోమికి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. దాంతో ప‌లు సినిమాల్లో న‌టించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ఖిలాడీ సినిమాలో షొమి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో ఘ‌న విజ‌యం సాధించ‌డంతోనే ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఆరేళ్ల పాటు స‌ల్మాన్ షోమీ జంట ప్రేమాయ‌ణం న‌డ‌ప‌టం తో ఇండ‌స్ట్రీలోహాట్ టాపిక్ గా ఉండేవారు. ఇక ప్ర‌స్తుతం షోమి ఓ ఎన్జీవో సంస్థ‌ను న‌డిపిస్తోంది. మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చే ఇంట్ర‌స్ట్ లేద‌ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: