బ్రేకింగ్ : రౌడీ హీరోతో దిల్ రాజు - వంశీ పైడిపల్లి భారీ ప్రాజక్ట్....??
అప్పట్లో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఎవడు తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు వంశీ పైడిపల్లి. అనంతరం నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో రూపొందిన ఊపిరి మూవీ ద్వారా ఇంకొక సక్సెస్ దక్కించుకున్న వంశీ ఆపై ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి మూవీ తెరకెక్కించి దానితో కూడా విజయాన్ని అందుకున్నారు. ఇటీవల మహర్షి మూవీకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డు రావడం జరిగింది.
దానితో దర్శకుడు వంశీ పై పలువురు అభిమానులు అలానే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆయన తదుపరి ఎవరితో సినిమా చేస్తారు అనేది అందరిలోనూ కొంత ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇటీవల మహేష్ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం కాకపోవడంతో మహేష్ దాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కోసం ఒక అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేసిన వంశీపైడిపల్లి అతి త్వరలో దాన్ని ఆయనకు వినిపించి ఆమోదం అందుకోనున్నారని, అలానే ఈ మూవీని కూడా దిల్ రాజు నిర్మించనున్నారని చెబుతున్నారు. మరి ఇదే గనుక నిజమైతే తొలిసారిగా వంశీ, విజయ్ ల కలయికలో ఒక బ్లాక్బస్టర్ సక్సెస్ వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు.....!!