సముద్రం సినిమాలో శ్రీహరి పాత్రలో నాగబాబు నటించకపోవడానికి కారణం ఇదే.. !!
కానీ అది అనుకున్నంత గుర్తింపు ఇవ్వలేదు.ఇక సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు మరింత ఎక్కువగా పోస్టులతో బిజీ గా మారాడు.తన వ్యక్తిగత విషయాల గురించి, కుటుంబం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు.ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు మిమర్స్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు.వారికి సరైన గుర్తింపు రావడం లేదంటూ, వారి విలువను చాలామంది గుర్తించలేకపోతున్నారని తెలిపాడు.ఇక ఇండస్ట్రీలో వీరిని ఎక్కువగా గుర్తించరని, కేవలం వారి మీమ్స్ ఆర్థికంగా సహాయపడుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే నాగబాబును ఓ మీమర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే నాగబాబు కూడా వాటికి వెంటనే స్పందించారు.మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రను రిజెక్ట్ చేసి బాధపడ్డరా అని అడగగా.తను ఒక పాత్ర రిజెక్ట్ చేసేంత సీన్ లేదని అన్నారు. అలాగే తన వరకు వచ్చిన పాత్రల్ని చేస్తానంటూ తెలిపాడు.కానీ ఓసారి తన వద్దకు వచ్చిన ఓ పాత్రను చేయలేకపోయానని చెప్పారు. అది సముద్రం సినిమాలో శ్రీహరి పాత్ర అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలో నటించమని డైరెక్టర్ కృష్ణ వంశీ నాగబాబుని అడిగారట. కానీ ఆ సమయానికి నాగబాబు ఫారెన్ లో ఉండడం వలన ఆ సినిమాలో నటించడం కుదరలేదని చెప్పుకొచ్చారు.. !