పాగల్ సినిమాలో మరో బ్యూటీ..!
బెక్కెం వేణుగోపాల్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రదన్ స్వరాలను సమకూరుస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో - రాహుల్ రామకృష్ణ - మురళీ శర్మ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సిమ్రన్ చౌదరి, మేగ లేఖ హీరోయిన్ లుగా నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా సినిమాలో నివేదిత పేతురాజ్ కూడా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో విశ్వక్ సేన్ రెండు చేతులు వెనక్కి కట్టేసి ఉండగా నివేదిత పేతురాజ్ రొమాంటిక్ హగ్ ఇచ్చింది. దీంతో సినిమాలో ముగ్గురు భామలతో విష్వక్ సేన్ రొమాన్స్ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మే1న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.