వామ్మో..... అందుకే Ntr 30 మూవీ ఆ కాన్సెప్ట్ తో తీస్తున్నారా ....??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ అరవింద సమేత. మూడేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుని తొలిసారిగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. అనంతరం మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. టాలీవుడ్ తో పాటు హాలీవుడ్ కు చెందిన పలువురు టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13 రిలీజ్ చేయనున్నారు. దీని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొకసారి ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతుంది. దీనిని మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కించనున్నాడని దానికి ప్రధాన కారణం రాబోయే మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానుండడంతో అందుకు సూచనగా ఈ మూవీని ఆయన చేయనున్నారు అనేది ప్రచారమవుతున్న వార్త యొక్క సారాంశం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఈ ప్రతిష్టాత్మక మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: