ఆదిత్య 369 లో కమల్ హాసన్..బాలకృష్ణ తో మల్టీ స్టారర్..?

P.Nishanth Kumar
సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అప్పటికి ఇలాంటి సినిమా టాలీవుడ్ లో రానేలేదు. దాంతో సినిమా ఎంతో ఫ్రెష్ గా అనిపించి ప్రేక్షకులు ఈ సినిమా ను పెద్ద హిట్ చేశారు. టైం మిషన్ నేపథ్యంలో అప్పుడప్పుడే బాలీవుడ్ లో సినిమాలు తీస్తున్న రోజుల్లో టాలీవుడ్ లో సింగీతం సినిమా ని రిలీజ్ చేసి విడుదల చేశారు.. మూడు కళ్లల్లోకి టైం మిషన్ ద్వారా ప్రస్తుతం కాలపు మనుషులు వెళితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేదే సినిమా కథ..
అలా టైం లో మిషన్ బాలకృష్ణ , హీరోయిన్ ఓ పోలీస్ ఆఫీస్ వెళ్లి శ్రీకృష్ణదేవరాయలు కాలానికి, ఫ్యూచర్ లోని కాలానికి వెళ్లి వస్తారు. ఇక ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనీ సింగీతం చాలా ట్రై చేశారు. బాలకృష్ణ వందో సినిమాగా ఈ సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేసినా ఎందుకో అది కుదరలేదు.ఈ సినిమా టీవీల్లో ప్రసారమయితే.. ఇప్పటికీ ప్రేక్షకులు స్మాల్ స్క్రీన్‌కు అతుక్కుపోతారు.బాలకృష్ణ.. ‘ఆదిత్య 369’లో  శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ముందుగా కృష్ణ కుమార్ పాత్ర కోసం కమల్ హాసన్‌ను అనుకున్నారట దర్శక నిర్మాతలు.
ఎందుకంటే.. సింగీతం అంతకు ముందు కమల్ హాసన్‌తో ‘విచిత్ర సోదరులు’, పుష్ఫక విమానం’  వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. మరోవైపు శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కోసం బాలకృష్ణ అయితే బాగుంటుందని ఆ పాత్ర బాలయ్య చేస్తేనే వంద శాతం న్యాయం చేయగలరని ఆయన్ని ఎంపిక చేశారట. కృష్ణకుమార్ పాత్రకు మాత్రం కమల్ హాసన్ ఆల్రెడీ ఓకే కూడా చెప్పారట. ఈ ఇద్దరితో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిందామనుకున్నారు.అయితే.. అప్పటికే కమల్ హాసన్.. మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటంతో ‘ఆదిత్య 369’  ప్రాజెక్టులో నటించేందుకు సాధ్య పడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: