చరణ్ సరసన మరోసారి ఆ హాట్ హీరోయిన్.. అభిమానుల్లో ఆత్రుత..?

praveen
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని  తెలుగు ప్రేక్షకుల మెగా పవర్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన రామ్ చరణ్ ఇక ఇప్పుడు ఏకంగా  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు దేశంలోని అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా వేయికళ్ళతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.



 అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ  పాత్రలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్  సీత పాత్రలో నటిస్తుంది. ఇటీవలే సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ చిత్ర బృందం విడుదల చేసింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీత పాత్రలో ఆలియా భట్ ఒదిగిపోయిన తీరు అటు ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో మెప్పించింది. సినిమా విడుదల కాకముందే ఈ ఇద్దరి జోడీ కాస్త ప్రేక్షకులందరికీ ఫేవరేట్ గా మారిపోయింది.



 ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఇటీవలే ప్రేక్షకులను ఆనంద పరిచే విధంగా మరో గుడ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. కేవలం ఆర్ఆర్ఆర్  సినిమాలో  మాత్రమే కాదు.. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అని అర్థమవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కించేందుకు అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి  అన్న విషయం తెలిసిందే  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించబోతున్నట్లు  ప్రస్తుతం టాక్  వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: