ఆ కొరియన్ రీమేక్ ఎవరి కోసం ?
నిజానికి కొరియాలో 2016 లో విడుదలైన లక్కీకీ అనే సినిమా సూపర్ హిట్ అయింది. దీనిని తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థ దాని రీమేక్ రైట్స్ కొనుక్కుంది. నిజానికి ఇదే సురేష్ ప్రొడక్షన్ సంస్థ గతంలో మిస్ గ్రానీ అనే సినిమాని కొనుగోలు చేసి దాన్ని ఓ బేబీ పేరిట తెలుగులో రీమేక్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాని కూడా నిర్మించడానికి సిద్ధమైంది.
కామెడీ అండ్ క్రైం ఎంటర్టైనర్ గా రిలీజయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఇండియన్ లాంగ్వేజ్ రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే వెంకటేష్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని ప్రచారం మొదలు కావడానికి ఓ కారణం కూడా ఉంది. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఎప్పుడైతే ఈ సినిమా చేస్తున్నామని ప్రకటించిందో ఆ వెంటనే వెంకటేష్ తన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఈయన ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం మొదలు యుండవచ్చు.