ఇతర దర్శకుల సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన గొప్ప టాలీవుడ్ డైరెక్టర్లు వీరే..

Suma Kallamadi
తాము రాసిన కథ దృశ్య రూపం దాల్చాలంటే దర్శకులకు ముందుగా నిర్మాతలు దొరకాలి. ప్రస్తుత స్టార్ డైరెక్టర్లు కూడా ఒకప్పుడు తమ సినిమాలకు నిర్మాతలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. బ్రేక్ వచ్చేంతవరకు ఏ డైరెక్టర్ అయినా కూడా నిర్మాతను వెతికే క్రమంలో చాలా అవరోధాలు ఎదుర్కొంటారు. అయితే తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రతిభావంతులైన నూతన దర్శకులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కొందరు డైరెక్టర్లు నిర్మాతలుగా మారుతారు. అంతేకాదు నూతన దర్శకుల సినిమాలను ప్రోత్సహించేందుకు సమర్పకులుగా కూడా మారతారు. అటువంటి డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. అనిల్ రావిపూడి - గాలి సంపత్

రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ తనికెళ్ళ భరణి సత్య ప్రధానపాత్రలలో నటించిన గాలి సంపత్ సినిమా కి అనిల్ రావిపూడి సమర్పకులుగా ఉన్నారు. అంతేకాదు అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ సినిమాకి అన్నిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అనిల్ రావిపూడి సూపర్ వైజ్ చేశారు.

2. నాగ్ అశ్విన్ - జాతి రత్నాలు

మహానటి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ జాతి రత్నాలు సినిమాని నిర్మించారు. అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

3. త్రివిక్రమ్ శ్రీనివాస్ - చల్ మోహన్ రంగా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇతర దర్శకులను బాగా ప్రోత్సహిస్తుంటారు. 2018 సంవత్సరంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చల్ మోహన్ రంగా సినిమాకి ఆయన కథ అందించడంతో పాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

4. సుకుమార్ - కుమారి 21ఎఫ్

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తారాగణంలో వచ్చిన కుమారి 21ఎఫ్ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు అని అందరూ అనుకుంటారు. కానీ ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి సుకుమార్ కథ అందించడంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమాకి ఆయన సమర్పకుడిగా  ఉన్నారు. బుచ్చిబాబు సనా సుకుమార్ పర్యవేక్షణలోనే ఉప్పెన సినిమా తీశారు. అయితే కుమారి 21ఎఫ్ ఏ స్థాయిలో హిట్ అయిందో ఉప్పెన సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: