ఆ సంఘటనతో మనస్తాపానికి గురైన చిత్ర..?
అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. అంతేగాక ఆ సంఘటనలు తీరని, మాయని గాయాలను కూడా చేస్తూ ఉంటాయి. చిత్ర జీవితంలో కూడా ఓ విషాద సంఘటన 2011 సంవత్సరంలో చోటు చేసుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్ లో పాటలు పాడడం కోసం చిత్ర తన ఒక్కగానొక్క కూతురు నందనను తన వెంటబెట్టుకుని వేరే దేశానికి వెళ్ళింది. అయితే అనుకోకౌండా తాను బస చేసే టువంటి హోటల్ లో ప్రమాదవశాత్తు నందన స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించింది.ఈ సంఘటనతో చిత్ర కొంతకాలం పాటు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ సంఘటన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికే నందనని తలుచుకుని చిత్ర బాధపడని రోజు లేదు.గడిచిన ఏడాది చిత్ర ఒక్కగానొక్క కూతురు వర్ధంతి కావడంతో ఆమె తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇందులో “ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతేగాక ఆ కారణం పూర్తయిన తర్వాత ఆత్మ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే కాలానికి కూడా ఎంతటి గాయం అయినా మాన్పించే శక్తి ఉందని అంటారు కానీ తన కూతురి మరణం చేసిన గాయం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉందని మిస్ యు నందన అంటూ ఎమోషనల్ అయ్యారు.దీంతో పలువురు నెటిజన్లు నందన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. అంతేగాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొందరు ముఖ్యమైన మనుషులు ఉంటారని వారు దూరమైన సమయంలో ఆ బాధ వర్ణనాతీతమని అలాగని ఆ బాదనే తలుచుకుని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని కాబట్టి మన నుంచి దూరంగా వెళ్ళి పోయిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదని చిత్రకి ధైర్యం చెబుతున్నారు