పాపం దిల్ రాజు షాదీ ముబారక్ సినిమాని సరిగ్గా పట్టించుకోని ఉంటే కథ వేరేలా ఉండేది...
ఇక దిల్ రాజు కొన్ని రీషూట్ లు చేయించి.. ప్యాచ్ వర్క్ లు చేయించి.. తన బ్యానర్ లో విడుదల చేశారు. కానీ తన సొంత సినిమాలకు చేసిన రేంజ్ లో పబ్లిసిటీ చేయలేకపోయాడు. దీంతో సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాలేదు. నిజానికి సినిమా చూసిన వారంతా కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.సినిమా చాలా బాగుందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదనిపించిందని రివ్యూలు ఇస్తున్నారు. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ. కలెక్షన్లు మాత్రం రావడం లేదు.
సరైన పబ్లిసిటీ చెయ్యక ప్రమోషన్స్ లేక ప్రేక్షకులకు ఈ సినిమా గురించి తెలియలేదు. ఇప్పటికైతే మౌత్ టాక్ తో సినిమాకి కలెక్షన్స్ మెరుగు అవుతాయని ఆశిస్తున్నారు. వీకెండ్ లో కలెక్షన్స్ పుంజుకున్నాయని చెబుతున్నారు. కానీ కొన్ని ఏరియాల్లో సినిమాను తొలిరోజే థియేటర్ల నుండి తీసేయాల్సి వచ్చింది.ఎందుకంటే ఆ ఏరియాలలో కలెక్షన్స్ సరిగ్గా నమోదవ్వలేదు పైగా సందీప్ కిషన్ 'ఏ 1 ఎక్స్ ప్రెస్ ' మంచి టాక్ ని తెచ్చుకుంది.సినిమాకి గనుక పబ్లిసిటీ గట్టిగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండి కథ వేరేలా వుండేది.