సింగర్ ప్రెగ్నెంట్.. నిరాశలో అభిమానులు.. అసలేమైంది..?

P.Nishanth Kumar
సాధారణంగా తమ అభిమాన స్టార్ ల జీవితంలో అకేషన్ వస్తే అభిమానులు ఎంతో ఆనందంగా కనిపిస్తుంటారు. వారి సెలబ్రేషన్ తమ సెలబ్రేషన్ లా ఫీల్ అయ్యి దాన్ని పండగ లా జరుపుకుంతుంటారు.ఈ ఉత్సవాలు సినిమా ల వరకు పరిమితం కాదు వారు పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలు కూడా అభిమానులకు ఎంతో ఆడంబరంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఓ సింగర్ ప్రెగ్నెంట్ అయితే మాత్రం అభిమానులు అయ్యో అని పెదవి విరుస్తున్నారట..
అభిమాన గాయని తల్లి కాబోతుంటే.. ఆమె మరో స్టెప్ ముందుకు వేసిందని, సంతోషకరమైన జీవితం అందుకోబోతోందని సంతోషపడాలి. కానీ అభిమానుల్లో నిరాశ, నిరుత్సాహం ఎందుకు అని అంతా అనుకోవడం సహజమే. అయితే విషయంలోకి వస్తే.. అభిమాన గాయని తల్లి అవుతున్నందుకు కాదు.. వారిలో నిరాశ. ఇక తమ అభిమాన గాయని నుంచి పాటలు రావనేది వారిలోకి నిరాశకు కారణం. ఈ మధ్య సింగర్స్ ప్రెగ్నెంట్ అయి పిల్లలను కన్న తర్వాత.. పాటలకు దూరం అవుతున్నారు. పాటలు పాడే అవకాశాలు కూడా వారికి తగ్గిపోతున్నాయి. అందుకు ఉదాహరణ గీతామాధురి.
గీతా మాధురి తల్లి అయిన తర్వాత ఆమెకు సింగర్‌గా ఛాన్స్‌లు ఎన్ని వచ్చాయో.. ఓ బిడ్డను కన్న తర్వాత ఆమె ఎన్ని పాటలు పాడిందో.. ప్రత్యేకంగా కౌంట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మహా అయితే ఓ రెండు మూడు పాటలు పాడే అవకాశాలు మాత్రమే ఆమెను వరించాయి. అలాంటిది.. ఆమె పాట వినకపోతే.. ఏదో పోగొట్టుకునేలా ఉండే శ్రేయాఘోషల్ అభిమానులు.. ఇప్పుడు తల్లి కాబోతోందని తెలిసి ఆనందించాలో.. లేక బాధపడాలో అర్థం కాని కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మరి వీరి ఆలోచనలు అన్ని దాటుకుని ప్రసవించాక శ్రియ ఘోషల్ మరిన్ని పాటలు పడుతుందా చూద్దాం..ఇక తను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ బేబీకి జన్మనివ్వబోతున్నాననే విషయం స్వయంగా సింగర్ శ్రేయా ఘోషలే ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసిన ఆమె.. ‘‘బేబీ శ్రేయాదిత్య త్వరలోనే రాబోతోంది. నేను, మా వారు ఆ మధుర క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, దీవెనలు కావాలని కోరుకుంటున్నాను..’’ అని శ్రేయో ఘోషల్ ట్వీట్‌లో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: