నన్ను పెళ్లి చేసుకుంటానంటే సర్వం ఇచ్చాను.. ఆర్యపై జర్మన్ మహిళా సంచలన ఆరోపణలు..?
ఆర్య ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉంటే పర్సనల్ లైఫ్ లో మాత్రం ఓ ఆరోపణ ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.. ఆర్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గర రూ. 80 లక్షలు తీసుకున్నాడని ఓ జర్మన్ యువతి ఆరోపించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేసింది. ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. చెన్నైలోని హెల్త్ కేర్ రంగంలో సదరు మహిళ పని చేస్తోంది. జర్మనీకి చెందిన మహిళ.. చెన్నైకు చెందిన మహ్మద్ అర్మన్, హుస్సేనీ ద్వారా ఆర్యను కలిసినట్టు వెల్లడించింది. వాళ్లిద్దరు తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర డబ్బు తీసుకునే సమయంలో వాళ్లు అనేక హామీలు ఇచ్చారని.. నటుడు ఆర్య, ఆయన తల్లి జమీలా సమక్షంలోనే ఈ నగదు లావాదేవీలు జరగాయని ఆరోపించింది.
లాక్డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ఆర్య చెప్పాడని.. సహాయం చేయాలని కోరాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తాను నచ్చానని చెప్పిన ఆర్య.. తనను పెళ్లి చేసుకుంటానని అన్నాడని వెల్లడించింది. అయితే ఆ తరువాత మోసం చేశాడని తెలిపింది. తనలాగే మరికొందరిని కూడా అతడు మోసం చేశాడని ప్రధానికి చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆర్య, ఆమె తల్లికి అనేకసార్లు కలిశానని.. అయితే వాళ్లు సరిగ్గా స్పందించలేదని ఆరోపించింది. వాళ్ల పలుకుబడి కారణంగా తనకు న్యాయం జరగలేదని వాపోయింది.