ప్రభాస్, బన్నీ ని పక్కన పెట్టేసిన సుధీర్ బాబు..సోషల్ మీడియాలో రచ్చ

MADDIBOINA AJAY KUMAR
సెలబ్రెటీలు ఏం మాట్లాడలన్నా...ఏం చేయలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం మాములుగా లేదు. ఒక్కసారి దొరికితే అంతే సంగతులు. తాజాగా హీరో సుధీర్ బాబు ఓ ట్వీట్ చేసి సోషల్ మీడియాలో అల్లు అర్జున్, ప్రభాస్ మరియు ఇతర హీరోల అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇంతకీ సుధీర్ బాబు ఏం ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ ఎందుకు సుధీర్ బాబు పై ఫైర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సుధీర్ బాబు "శ్రీదేవి సోడా సెంటర్" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు "పలాస" తో హిట్ కొట్టిన కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు. ఆ ప్రాంతాల నేపథ్యంలో నే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుదీర్ బాబు లైటింగ్ సూరి బాబు గా కనిపించబోతున్నాడు. చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా సుదీర్ బాబు ఈ సినిమాలోని ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడమే రచ్చగా మారింది. ఈ ఫొటోకు సుదీర్ బాబు "సుధీర్ బాబు" విత్ స్టార్స్ అనే క్యాప్షన్ ను పెట్టారు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రజినీకాంత్ ల ఫోటోలు ఉన్నాయి. అయితే ప్రభాస్, అల్లు అర్జున్ ల కటౌట్ లు ఫొటోలో కనిపించడం లేదు. దాంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సుధీర్ బాబు పై ఫైర్ అవుతున్నారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. మా హీరోలు స్టార్ హీరోలు కాదా అని అడుగుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మా డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అని ఎలా మరిచిపోతారని సుధీర్ బాబు పై మండి పడుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం బన్నీ కటౌట్ ఎలా మరిచిపోయావని అడుగుతున్నారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణని ఎలా మరిచిపోయావని కూడా సుదీర్ బాబు ను అడుగుతున్నారు. సుధీర్ బాబు సినిమా పబ్లిసిటీ కొసమే ఇలా ప్లాన్ చేసారా..? లేదంటే ఇలా జరుగుతుందని ఉహించకుండా ఏదో క్యాజ్వల్ గా ఫోటో పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: