దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

shami
టిక్ టాక్ తో పాపులర్ అయిన దీపిక పిల్లిని ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో టీం లీడర్ గా తీసుకున్నారు. ఈ షోలో రష్మి, దీపికలు ఇద్దరు క్వీన్స్ టీం లీడర్స్ గా ఉన్నారు. కింగ్స్ టీం లీడర్ గా సుధీర్, ఆదిలు ఉంటున్నారు. అయితే సుధీర్, రష్మిల పులిహోర కార్యక్రమాలు అందరికి తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన దీపికా పిల్లితో మింగిల్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు ఆది. అయితే దీపిక మాత్రం అతనికి ఏమాత్రం ఇవ్వట్లేదు.

ఇక సోషల్ మీడియాలో అమ్మడికి సూపర్ క్రేజ్ రాగా.. ఢీ షో టీం లీడర్ గా దీపికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ క్రమంలో అమ్మడు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ తెచుకుంది. ఇన్ స్టాగ్రాం లో అమ్మడు 1 మిలియన్ ఫాలోవర్స్ దాకా వచ్చారు. ఇదంతా ఢీ షో వల్లే అని చెప్పొచ్చు. దీపిక పిల్లి ఢీ షోకి వెళ్లడానికి ముందు కొద్దిమంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు కాని ఎప్పుడైతే ఢీ 13కి టీం లీడర్ గా సెలెక్ట్ అయ్యిందో అప్పటినుండి అమ్మడికి ఫాలోయింగ్ పెరిగింది.

తనకు వచ్చిన ఈ క్రేజ్ ను ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్ పెడుతూ రచ్చ చేస్తుంది అమ్మడు. అదే అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. లేటెస్ట్ గా దీపికకు 1 మిలియన్ ఫాలోవర్స్ రాగా అందుకు ఆమె స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీపిక పిల్లి చేస్తున్న ఈ ప్రైవేట్ ఫోటో షూట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అమ్మడు ఇలానే కొనసాగితే త్వరలోనే హీరోయిన్ గా కూడా ఛాన్స్ రాబట్టుకుంటుందని చెప్పొచ్చు. దీపిక పిల్లి ఈమధ్య బుల్లితెర మీద అలరిస్తున్న అమ్మడు పేరు బాగా వినిపిస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: