గోవా లో బికినీ లో ఆర్జీవీ తో అరియనా రచ్చ.. ఫోటో లు వైరల్..?

P.Nishanth Kumar
బిగ్ బాస్ షో ద్వారా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి అరియానా..ఆమె ఇటీవలే సోషల్ మీడియా లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు..  బిగ్ బాస్ షో నాల్గో సీజన్ గడిచిపోయి నెల రోజులు దాటినా కూడా కంటెస్టెంట్ల హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. సోషల్ మీడియా లో ఈరోజుకి కూడా ప్రతీ ఒక్కరూట్రెండింగ్‌లోనే ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం.. లేదా.. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ  ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నారు..  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక మోనాల్, అఖిల్, సోహెల్, మెహబూబ్ వంటి వారంతా కలిసి రచ్చ చేస్తుంటే మరో వైపు లాస్య, హారిక, నోయల్ వంటి వారు.. ఇంకో వైపు అరియానా, అవినాష్‌లు కలిసి రచ్చ చేస్తున్నారు.

మా టీవీ లో బిగ్ బాస్ ఉత్సవం అంటూ మొదలైన ఓ షో ద్వారా మళ్ళీ ప్రేక్షకులను అలరించిన కంటెస్టెంట్ లు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. తాజాగా అరియన్ గోవా లో మెరిసింది. అక్కడ ఆర్జీవీ ని కలిసింది కూడా. నిజానికి ఆమెకు ఎంతో కొంత ఫేమ్ వచ్చింది అంటే అది ఆర్జీవీ పుణ్యాన్నే అని చెప్పొచ్చు.రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగానే ఫేమస్ అయింది. అలా లాక్డౌన్‌లో ఫేమస్ అయిన అరియానా ఏకంగా బిగ్ బాస్ టీం దృష్టిలో పడింది. అలా ఆర్జీవీ చేసిన తొడల కామెంట్లు కూడా బాగా కలిసి వచ్చాయి. అలా మొత్తంగా అరియానా కెరీర్‌ను ఆర్జీవీ మలుపు తిప్పేశాడు.

ప్రస్తుతం శ్రీముఖి, అరియానా, విష్ణుప్రియ, అవినాష్‌లు గోవాలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా ఈ గ్యాంగ్ గోవాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీని తన కార్యాలయంలో అరియానా కలిసినట్టుంది.ప్రస్తుతం ఆర్జీవీ తన ఆఫీస్‌ను గోవాకు మకాం మార్చేశాడు. అలా అరియానా ఇప్పుడు గోవాలో ఉండటంతో వెళ్లి కలిసింది. దీంతో అరియానా గాల్లో తేలిపోయింది. బిగ్ బాస్ తరువాత చివరకు నా ఫేవరేట్ అయిన ఆర్జీవీ గారిని కలిశాను.. నాతో విలువైన సమయం గడిపినందుకు థ్యాంక్యూ సర్ అంటూ సంబరపడిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: